ప‌ది మందిలో ఒకరికి కరోనా: డబ్ల్యూహెచ్‌వో

-

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచవ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను భ‌య‌కంపితుల‌ను చేస్తున్న‌ది. రోజురోజుకూ పాజిటివ్ కేసు‌ల సంఖ్య పెరిగిపోతున్న‌ది. ప్ర‌మాద‌క‌ర‌మైన కొవిడ్‌-19 కు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి టీకాలు గానీ, మందులుగానీ అందుబాటులోకి రాలేదు. ఈనేప‌థ్యంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్ల‌డించిన విష‌యాలు ప్ర‌జ‌ల‌ను మ‌‌రింత ఆందోళ‌నకు గురి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పది శాతం మంది కోవిడ్‌ మహమ్మారి బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర సేవల విభాగం అధిపతి డాక్టర్‌ మైఖేల్‌ రయాన్‌ ప్రకటించారు.

డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం, ఇది వాస్తవంగా కరోనా సోకిన వారి సంఖ్యకన్నా 20 రెట్లు అధికమని వెల్ల‌డించారు. రానున్నది అత్యంత క్లిష్టమైన కాలమని ఆయన హెచ్చరించారు. ప్రతి 10 మందిలో ఒకరు కరోనా వైరస్‌ బారిన పడినట్లు ఆయన పేర్కొన‌డం భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. క‌రోనా వైర‌స్‌పై చర్చిం చేందుకు 34 సభ్య దేశాల ఎగ్జిక్యూటివ్‌ బోర్డు స‌మావేశం అయింది. ఈ స‌మావేశంలో మైఖేల్‌ రయాన్‌ మాట్లాడుతూ ప్రపంచ జనాభా 760 కోట్లలో, 76 కోట్ల మంది కరోనా బారిన పడ్డారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 3.5 కోట్ల మందికి పైగా కరోనా బాధితులున్నారని ఆయన వెల్ల‌డించారు. ఇక భార‌త్ లో కోవిడ్‌–19 కేసుల సంఖ్య 65 లక్షలు దాటింది. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 84.13 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.55 శాతానికి పడిపోయింద‌ని వెల్ల‌డించింది.

Read more RELATED
Recommended to you

Latest news