తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు నేటితో పుల్‌స్టాప్‌..!

-

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం గత కొద్దీ రోజులుగా రాజకీయ హీట్ పుట్టిస్తున్నాయి..ముఖ్యంగా కృష్ణా జలలాపై రెండు రాష్ట్రాల మధ్య ఆది నుంచే వివాదం కొనసాగుతుంది..ఏపీ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత నీటి సమస్యలకు ఫుల్‌స్టాప్ పడుతుందని అనుకున్నారు..కాని పరిస్థితి మరింత జఠిలంగా మారింది..చాలా సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు పలు సమస్యలపై చర్చించినప్పటికి నీటి వివాదం మాత్రం ఇప్పటి వరకూ కొలిక్కి రాలేదు.. రాష్ట్రం విడిపోయిన తొలి నాళ్లలో చంద్రబాబు-కేసీఆర్‌ నీటి సమస్యలకు పరిష్కారం చూపనప్పటికి, తర్వాత జగన్ సీఎం అయ్యాక ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికి కృష్ణానది జలాల విషయంలో వైరం కొనసాగుతూనే ఉంది.

చాలా సందర్భాల్లో నీటి కొసం తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం,భౌతిక దాడుల వరకు కూడా వెళ్లింది..ఇప్పుడు జల వివాదంలో కేంద్రం జోక్యం చేసుకుంది..చాలా సార్లు తెలుగురాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించడానికి అపెక్స్‌ కౌన్సిల్ ద్వారా పరిష్కారానికి కేంద్ర అనేక ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం ఇవ్వలేదు..ఈరోజు మరోసారి అపెక్స్‌ కౌన్సిల్ భేటీ కానుంది..ఈ తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు నేటితో పుల్‌స్టాప్‌ పడే అవకాశం ఉంది..గోదావరి, కృష్ణా నీటి పంపకాల్లో లెక్క తేల్చి.. రెండు రాష్ట్రాల అభ్యంతరాలపై ఇవాళ్టి అపెక్స్ కౌన్సిల్‌ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది.

గోదావరి, కృష్ణా బేసిన్‌లో నీటి వినియోగం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై ఇప్పటికే రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇవాళ్టి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో తమ వాదనలు గట్టిగా విన్పించేందుకు సిద్ధమయ్యాయి తెలుగు రాష్ట్రాలు. కరోనా కారణంగా.. వర్చువల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదనలు విన్పించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news