ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ ప్రమాదం జరగడం బాధాకరమని సిఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. గ్యాస్ లీక్ ఘటనపై కమిటి ఏర్పాటు చేసారు. ఈ ఘటనపై కమిటి ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించామని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అలారం మొగాల్సింది అని ప్రమాదం జరిగిన వెంటనే 5 గంటలకు అంబులెన్స్ లు వచ్చాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కలెక్టర్, సీపీతో కూడిన కమిటి విచారణ చేస్తుందని అన్నారు. గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారులు సమర్ధవంతంగా పని చేసారని జగన్ పేర్కొన్నారు.పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారని జగన్ పేర్కొన్నారు. పాలిమరైజేషణ్ జరిగిందని అన్నారు. మృతుల కుటుంబాలకు కోటి నష్టపరిహారం ఇస్తున్నామని కంపెనీ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే తాము పరిహారం ఇస్తామని స్పష్టం చేసారు.
ఆస్పత్రుల్లో ఉన్న వారికి లక్ష రూపాయలు ఇస్తామని, వైద్యం చేయించుకునే వారికి లక్ష ఇస్తామని, వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లకు పది లక్షలు ఇస్తామని, 5 బాధిత గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి 10 వేలు సహాయం చేస్తామని, ప్రాధమిక చికిత్స చేయించుకున్న వారికి 25 వేలు ఇస్తామని ఆయన ప్రకటించారు.