తెలంగాణలో మరోసారి బిట్‌కాయిన్ మోసం వెలుగు చూసింది. రామగుండం, వరంగల్, మంచిర్యాల, మందమర్రి ప్రాంతాల్లోని వందల మంది బాధితుల నుంచి వందల కోట్లు వసూలు చేసింది బిట్‌కాయిన్ ముఠా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వస్తుందని చెప్పడంతో తమ ఆస్తుల్ని తాకట్టుపెట్టి మరీ బాధితులు బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టారు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్ సీసీయస్ పోలీసులను ఆశ్రయించారు.
ఇంతకు ముందే బిట్ కాయిన్ గ్యాంగ్ కోసం గాలించిన హైదరాబాద్ సీసీయస్ పోలీసులకు ప్రధాన నిందితుడు నాగరాజు డిల్లీలో పట్టుబడ్డాడు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ఆశిష్ మాలిక్, సునీల్ సింగ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. నాగరాజును లోతుగా విచారిస్తే బిట్‌కాయిన్ పేరుతో తమ నుంచి వసూలు చేసిన సొమ్మంతా రికవరీ చేయొచ్చంటున్నారు బాధితులు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసి పేద ప్రజలమైన తమ సొమ్మును ఇప్పించాలని బిట్ కాయిన్ బాధితులు వాపోతున్నారు.