జగన్ ను ఇది మామూలు అగ్ని పరీక్ష కాదు!

-

అసలే కరోనా సమయం.. లాక్ డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థం. ఖజానాకు అవుట్ గోయింగే తప్ప ఇన్ కమింగ్ లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఊహించని షాక్… ఏడాది బడ్జెట్ లోనేమో నూటికి ఎనభైరూపాయలు సంక్షేమానికే ఖర్చుపెడతానంటున్న ఏపీ సీఎం… ఈ పరిస్థితుల్లో ఏపీ పరిస్థితి ఏమిటి? తాము ముఖ్యమంత్రి అయిననాటి నుంచీ జనాలు కాస్తో కూస్తో సంతోషంగా, సుఖంగా ఉన్నారు కానీ… జగన్ కు మాత్రం అన్నీ అగ్ని పరీక్షలే అనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… మడమ తిప్పడు అని చెబుతున్న సమయంలో జగన్ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి? అసలు కేంద్రం చేసిన ప్రకటన ఏమిటి? ఒకసారి చూద్దాం!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాలకు షాకింగ్ విషయం ఒకటి చెప్పింది. కరోనా మహమ్మరి వేళ లాక్ డౌన్ తో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా డౌన్ అయిపోయిన ఈ పరిస్థితుల్లో తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. “కేంద్రం నుంచి ఇకపై కొత్త పధకాలు ఉండవు.. కనీసం ఒక ఏడాది పాటు ఇదే నిషేధం కొనసాగుతుంది.. అన్ని విభాగాలు దీన్ని అర్ధం చేసుకుని కొత్త ప్రతిపాదనలు పంపరాదు” అన్నది ఆమె ప్రకటనలోని విషయం! కేంద్రం ఈ స్థాయిలో ఇంత క్లియర్ గా చెప్పేసరికి రాష్ట్రాలు దిక్కులు చూస్తున్న పరిస్థితి. ఈ విషయంలో ఇప్పటికే కాస్తో కూస్తో సెటిల్ అయిన రాష్ట్రాల సంగతి అటుంచితే… ఏపీ పరిస్థితి ఏమిటి?

కేంద్రమే ఇలా చేతులెత్తేసి కొత్త పధకాలు వద్దు అంటోన్న తరుణంలో… సంక్షేమమే తన ప్రథమ ప్రియారిటీ అని నమ్మి ఆ దిశగా ముందుకు పోతున్న ఏపీ సర్కార్ పరిస్థితి ఏమిటి? జగన్ ఏమో చెప్పినవీ, చెప్పనివీ అంటూ సంక్షేమానికి డబ్బు అధికంగా ఖర్చు పెడుతున్నారు. “సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి… కానీ కామన్ మ్యాన్ సమస్యలు మాత్రం కామన్ కాబట్టి… సంక్షేమ పథకాల విషయంలో జగన్ రాజీపడరనే” కామెంట్లు వినిపిస్తున్నాయి. తొలి ఏడాది బడ్జెట్లో సంక్షేమానికి నూటికి ఎనభై రూపాయలు ఖర్చు చేస్తున్న ఏపీ సర్కార్… మరో కొన్ని రోజుల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? సంక్షేమం విషయంలో జగన్ ఆలోచన ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నల సంగతి అలా ఉంచితే… జగన్ కు మాత్రం ఇది నిజంగా అగ్ని పరీక్షే!

Read more RELATED
Recommended to you

Latest news