తెలంగాణాలో మరో రేప్ అండ్ మర్డర్.. అసలేమైంది ?

మహిళల కోసం ఎన్ని చట్టాలు చేస్తున్నా వాళ్ళ మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రేమించక పోతే ప్రేమిస్తున్న వాళ్ళు చంపేస్తున్నారు, ప్రేమిస్తే తల్లితండ్రులు చంపేస్తున్నారు. స్నేహితులు కదా అని నమ్మి బయటకు వెళ్తుంటే నమ్మి వెళ్ళిన ఆ స్నేహమే కాటు వేస్తోంది. తాజాగా జరిగిన ఒక ఘోర సంఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లా నాయక్ తండాకు చెందిన 20 ఏళ్ళ యువతి అజ్మీరా కొటేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

నల్గొండ గురుకుల కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కోటేశ్వరి పీజీ కోచింగ్ కోసం మొన్న గురువారం నాడు నల్గొండ నుంచి ఘట్ కేసర్ వెళ్ళింది. అయితే అక్కడ అపస్మారక స్థితిలో కనిపించింది. అయితే ఆ యువతి మీద అత్యాచారం జరిగిందని, పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం మమత ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. ఆ యువతిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా ఆదివారం మృతి చెందింది. పోలీసుల జోక్యంతో నిన్న కోదాడలో మృతదేహానికి పోస్తుమార్టం పూర్తి చేశారు. బైక్ పై స్నేహితురాలి బంధువు తీసుకెళ్లినట్టు గుర్తించిన పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని పేర్కొన్న బంధువులు, మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.