ఏమిటీ పశువాంఛ? ఎక్కడికి పోతోంది మన సమాజం?

-

మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కలకలం రేపుతున్నాయి. మూడేళ్ళ పసిపాప నుండి పండు ముదుసలి దాకా ఎవ్వరినీ మ్రుగాళ్ళు వదలడం లేదు. తాజాగా ఈ అత్యాచారాల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ! రాయలపేటలో నిన్న సాయంత్రం జరిగిన ఈ సంఘటన గురించి వినడానికే జుగుప్స కలుగుతోందని చెబుతూ ఆయన జనసేన తరపున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ పసిదాని పరిస్థితి ఊహించుకుంటే గుండెలు భారంగా మారిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మృగాడి పైశాచికత్వానికి బలైపోయిన ఆ అభాగ్యురాలు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోందన్న పవన్ ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు చెబుతున్న వీడియో చూసినప్పుడు కలిగిన ఆవేదన మాటలకు అందనిదని పేర్కొన్నారు. ఆడుకోవడానికి పొరుగింటికి వెళితే 26 ఏళ్ల మానవ మృగం ఆ పసిదానిని కబళించి వేసిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే 584 అత్యాచారం కేసులు నమోదు అయ్యాయని ఆయన అన్నారు. నిర్భయ, దిశ వంటి చట్టాలు ఉన్నా ఆడపడుచులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి? అని పవన్ ప్రశ్నించారు. ఎప్పుడో పడే శిక్షలకు దుష్టులు భయపడడం లేదా? అని ప్రశ్నించిన ఆయన అందువల్లే నేరం చేయాలంటేనే భయపడే శిక్షలు రావాలి. అవి బహిరంగంగా అమలు కావాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news