టీడీపీ ఎమ్మెల్యేలు 19కి పడిపోతున్నారా?

-

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ కి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయనే అనుకోవాల్సిన పరిస్థితి! 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో చావు తప్పి కన్ను లోటబోయిందనే పరిస్థితి తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీకి… తాజా పరిస్థితులు ఇంకా దెబ్బమీద దెబ్బ కొడుతూనే ఉన్నాయి! 2019 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం… ఏ విషయంలోనూ టీడీపీకి పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. సభ లోపలా బయటా.. టీడీపీని అధికా పక్షం మాటల దాడులతో కోలుకోకుండా చేసింది. అనంతరం కరోనా వచ్చింది… ఈ సమయంలో కూడా బ్యాడ్ టైం అనుకోవాలో ఏమో కానీ… రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబద్ లో ఇరుక్కుపోయారు చంద్రబాబు నాయుడు. అవన్నీ చాలవన్నట్లు తాజాగా మరో వార్త ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేస్తొంది.

వివరాళ్లోకి వెళ్తే… గడిచిన ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితం అయిన తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే బయటకు వచ్చేశారని చెప్పుకోవచ్చు! కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు.. మరో సీనియర్ నేత ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సైతం తన కుమారుడు కరణం వెంకటేష్ ను వైసీపీ లో చేర్పించడంతో ఇక ప్రస్తుతం టీడీపీకి కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో సీనియర్ ఎమ్మెల్యే సైతం చంద్రబాబుకి షాక్ ఇస్తార‌న్న వార్తలు ఏపీలో బలంగా వినిపిస్తున్నాయి!

ప్ర‌కాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌… తాజాగా టీడీపీకి షాకిచ్చే లిస్ట్ లో చేరబోతున్నారని వార్తలొస్తున్నాయి! గ‌తంలో కాంగ్రెస్ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గొట్టిపాటి ర‌వి.. 2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచారు. అనంతరం చంద్రబాబు జరిపిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో సైకిల్ ఎక్కేశారు. అనంతరం జరిగిన 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోయినా కూడా గొట్టిపాటి ర‌వి మాత్రం నాలుగో విజ‌యం దక్కించుకున్నారు. ఈ క్రమంలో తాజా పార్టీ పరిస్థితుల నేపథ్యంలో రేపో మాపో గొట్టిపాటి ర‌వి వైసీపీ గూటికి చేరేందుకు రెడీ అవుతున్నార‌ట!

అయితే దీనికి కారణం… ర‌వి గ్రానైట్ వ్యాపారాల‌పై జరుగుతున్న దాడులు అని, ఈ విషయంలో జిల్లాకే చెందిన మంత్రి ద్వారా ర‌వి ఈ విష‌యంలో ఇప్ప‌ట‌కి అయితే కాస్త ఉప‌శ‌మ‌నం పొందార‌ని అంటున్నారు. సరే… కథాకమీషు ఏమైనా… చంద్రబాబుకి మాత్రం మరో షాక్ తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Latest news