ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ 19 ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్ర అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా వైరస్ మాత్రం వేగంగా రాష్ట్రంలో సోకుతుంది. నేడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదివేల కేసులకు పైగా నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 70,068 శాంపిల్స్ పరీక్షించగా అందులో 10,167 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్ 19 కేసుల సంఖ్య 1,30,557 కు చేరుకుంది. మరోవైపు తాజాగా రాష్ట్ర మొత్తం 4618 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.
ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 69,252 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 18,90,077 శాంపిల్స్ ను పరీక్షించారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 68 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1281 కు చేరుకుంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1441 కేసులు నమోదయ్యాయి. మరోవైపు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 187 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.
#COVIDUpdates: 30/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,27,662 పాజిటివ్ కేసు లకు గాను
*57,147 మంది డిశ్చార్జ్ కాగా
*1,281 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 69,234#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/LfYawjdsT4— ArogyaAndhra (@ArogyaAndhra) July 30, 2020