మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ కొత్తగా వన్‌ప్లస్ 8టి పేరిట ఓ నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.55 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అందువల్ల పిక్చర్ క్వాలిటీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు.
వన్‌ప్లస్ 8టి స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 5జి కి సపోర్ట్‌నిస్తుంది. 12 జీబీ వరకు పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇందులో ఆండ్రాయిడ్ 11 లభిస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 16 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ మోనో క్రోమ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంది. దీనికి 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్ 0 నుంచి 100 శాతం చార్జింగ్ పూర్తయ్యేందుకు కేవలం 39 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.
వన్‌ప్లస్ 8టి స్పెసిఫికేషన్స్…
* 6.55 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే
* 1080 x 2400 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
* 2.84 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్
* 8/ 12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11
* డ్యుయల్ సిమ్, 48, 16, 5, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
* యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.1, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
వన్‌ప్లస్ 8టి స్మార్ట్ ఫోన్ ఆక్వామెరైన్ గ్రీన్, లూనార్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.42,999 ఉండగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,999గా ఉంది. అమెజాన్, వన్‌ప్లస్ ఆన్ లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను అక్టోబర్ 16 నుంచి విక్రయించనున్నారు.
లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఆఫర్లను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తారు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ కింద ఈ ఫోన్ ను కొనవచ్చు. జియో వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.6వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.