ఏపీ ప్రభుత్వంపై హైకోర్ట్ లో మరో పిటీషన్, ఇబ్బందేనా…?

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్ లో మరో పిటీషన్ దాఖలు చేసారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గృహాల పై హైకోర్టు లో పిల్ దాఖలు చేసారు న్యాయవాది సోమయాజీ. రాష్ట్రం లో 84 వేల ఇళ్లు నిర్మాణ పూర్తి చేసుకున్నాయి అని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ సొమ్ము తో కట్టిన ఇళ్లు ప్రారంభానికి ముందే శిధిలావస్దకు చేరుకుంటున్నాయని ఆయన వివరించారు.

నివాసానికి సిద్దంగా ఉన్న గృహాలను తక్షణమే పేదలకు పంపిణీ చేయాలని పిల్ దాఖలు చేసారు. దీనిపై ఏపీ హైకోర్ట్ విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ఇళ్ళను నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news