వైరల్‌ : పుష్ప ఐటెం సాంగ్‌లో రెచ్చిపోయిన సమంత..

పుష్ప సినిమాలోని ఊ అంటావా ఊఊ అంటావా అనే ఐటెం సాంగ్‌ ఎంత పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి ముఖ్య కారణం ఈ సాంగ్‌ లో… టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించడం. అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న అనంతరం.. సమంత… పుష్ప ఐటెం సాంగ్‌ లో నటించింది. దీంతో ఫ్యాన్స్‌ అంతా ఈ పాట కోసం ఎగబడ్డారు.

అటు లిరిక్స్‌ కూడా అందరినీ ఆకట్టుకోవడంతో… ఈ పాటను మళ్లీ మళ్లీ వింటూన్నారు. అయితే… ఈ పాటకు సమంత ఎంత కష్టపడిందో… మనకు తెలీదు. అయితే… ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇందులో డ్యాన్స్‌ మాస్టర్‌ చెప్పినట్లు ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించింది సమంత. అనుకున్న ఔట్‌ పుట్‌ వచ్చేంత వరకు వదిలిపెట్టరంటూ ట్రేనర్స్‌ ను ఉద్దేశించి నవ్వుతూ చెప్పుకొచ్చింది సమంత. కాగా…డిసెంబర్‌ 17 వ తేదీన విడుదలైన పుష్ప సినిమా టాలీవుడ్‌ ను షేక్‌ చేస్తుంది. ఇక ఈ సినిమా ఇవాళ సాయంత్రం ఓటీటీలో రిలీజ్‌ కానుంది.