టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై శ్రీరెడ్డి హాట్‌ కామెంట్స్‌.. స్నానం చేయిస్తావా అంటూ !

నటి, రాజకీయ విమర్శకు రాలు శ్రీ రెడ్డి… గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఏదో ఒక అంశంపై సోషల్‌ మీడియాలో చర్చ పెడుతూ… రాజకీయ నాయకులు, టాలీవుడ్‌ నటులపై కామెంట్లు పెడుతోంది. ముఖ్యంగా వైసీపీ పార్టీపై ఎవరైనా కామెంట్లు చేస్తే… శ్రీ రెడ్డి… వారిపై ఓ రేంజ్‌లో రెచ్చి పోతుంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, టీడీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ… సెటైర్లు వేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి.

అయితే.. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని టార్గెట్‌ చేసింది శ్రీ రెడ్డి. స్నానం చేయిస్తావా అంటూ జీవన్‌ రెడ్డిపై సెటైర్లు పేల్చింది. టీవీ 9 ఛానల్‌ లో జీవన్‌ రెడ్డి మాట్లాడిన మాటలను ట్రోల్‌ చేసింది శ్రీరెడ్డి. ”మిషన్‌ భగీరథ నీళ్లతో మహిళలకు స్నానం చేయిస్తావా… ‘స్నానం చేయించడం అంత ఇష్టమా… అమ్మ ఆశ దోశ… స్నానం చేయించి… అన్ని చూస్తావా..మొదట్లో ఇలాంటి మాటలు లేవు. ఇప్పుడు బాగా మాటలు నేర్చావు. పిట్ట కొంచెం.. కూత ఘనం” అంటూ జీవన్‌ రెడ్డి పై హాట్‌ కామెంట్స్‌ చేసింది శ్రీరెడ్డి.