ప్రత్యర్ధులు మెచ్చిన మంత్రి మేకపాటి!

-

ఏపీ రాజకీయాల్లో అనూహ్య ఘటన..సొంత పార్టీ వాళ్లే  కాదు…ప్రత్యర్ధి పార్టీలు సైతం బాధపడే ఘటన జరిగింది..అదే ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం..చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి విజయవంతంగా దూసుకుపోతున్న మేకపాటి చిన్న వయసులోనే మరణించడం అందరికీ దిగ్భ్రాంతికి గురి చేసే అంశం..ఇటీవలే వారం రోజుల పాటు ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించడం కోసం దుబాయికి వెళ్లొచ్చిన గౌతమ్…సడన్‌గా గుండెపోటుతో మరణించారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇక మేకపాటి మృతి పట్ల వైసీపీ నేతలే కాదు…టీడీపీ, ఇతర పార్టీ నేతలు, తెలంగాణలోనే నేతలు సైతం సంతాపం తెలియజేస్తున్నారు. ఇలా చిన్న వయసులోనే మేకపాటి మరణించడం అందరికీ షాక్‌కు గురి చేసిందని చెప్పాలి. అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్…2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఆత్మకూరు నుంచి గెలిచారు..అలాగే జగన్ క్యాబినెట్‌లో కీలకమైన పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు దక్కించుకున్నారు.

అయితే ఏపీలో ఉన్న మంత్రులకు భిన్నంగా మేకపాటి వైఖరి ఉండేది..ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ వెళ్లిపోవడమే తప్ప..మీడియా సమావేశాలు పెట్టి హడావిడి చేయడం…ప్రత్యర్ధి పార్టీలని చెడామడా తిట్టడం లాంటి కార్యక్రమాలు చేసే వారు కాదు. అసలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎప్పుడు విమర్శలు చేసిన సందర్భం లేదు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకు రావాలనే పనిలోనే ఉండేవారు.

అటు తన నియోజకవర్గం ఆత్మకూరులో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు…సమస్య ఉందని వచ్చిన వారికి అండగా ఉండేవారు..ఏదో వైసీపీ వాళ్ళకే కాకుండా టీడీపీ వాళ్ళు సైతం ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునేవారు. అలాగే టీడీపీ సైతం…ఇతర మంత్రులపై విమర్శలు చేసింది గాని..మేకపాటిపై ఎప్పుడు విమర్శలు చేయలేదు. ఇలా అందరివాడుగా ఉన్న మేకపాటి మృతి చెందడం వైసీపీ శ్రేణులనే కాదు..టీడీపీ శ్రేణులని సైతం దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పొచ్చు. మొత్తానికి రాజకీయాల్లో ప్రత్యర్ధులని సైతం మెప్పించే మంత్రిగా పనిచేసిన మేకపాటి లేకపోవడం రాజకీయాల్లో పెద్ద లోటు అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news