తెలుగు రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

-

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా మొత్తం 17 మంది హైకోర్టు ల న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇందు లో మొత్తం 8 మంది హైకోర్టు ల న్యాయ మూర్తులను ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ… సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు జారీ చేసింది. అలాగే, ఐదు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సిఫారసులు జారీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.

ఈ నేపథ్యం లో రెండు తెలుగు రాష్ట్రా లైన ఆంధ్ర ప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాలకు కూడా హై కోర్టు చీఫ్‌ జస్టిస్‌ లను నియమిస్తూ… ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా సతీశ్ చంద్ర శర్మ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ కాగా… ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రశాంతి కుమార్ మిశ్రా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రశాంతి కుమార్ మిశ్రా మొదటగా… చత్తీస్‌ ఘడ్‌  రాష్ట్ర న్యాయమూర్తి గా పని చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news