మార్కెట్‌లో ఎన్నో ఫోన్లు వస్తుంటాయి..కొన్ని అయితే మనకు అసలు వాటి పేరు కూడా తెలియదు.. మనం ఎప్పుడూ బాగా వినిపించే సో కాల్డ్ ఆ నాలుగు ఐదు కంపెనీల ఫోన్ల గురించే తెలుసుకుంటాం.. ఔకిటెల్ కంపెనీ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. చైనాలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇది రగ్డ్ ఫోన్. రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవచ్చు. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ కూడా బాగుంది.
ఫోన్ ధర..
ఈ ఫోన్ ప్రారంభ ధర 280 డాలర్లు. అంటేమన కరెన్సీలో దాదాపు రూ. 22,800. నవంబర్ 24 నుంచి అలీఎక్స్‌ప్రెస్‌లో అమ్మకాలు ప్రారంభం అవుతాయి.
స్పెసిఫికేషన్స్, ఫీచర్స్…
120 హెర్ట్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. సెకండరీ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ఇది ఉంటుంది.
ఏఓడీ సపోర్ట్ చేస్తుంది. నోటిఫికేషన్స్ చూడొచ్చు. మ్యూజిక్ కంట్రోల్స్ ఉంటాయి.
ఈ ఫోన్‌ను మీరు వాచ్‌గా కూడా మార్చుకోవచ్చు. వివిధ రకాల వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫోన్‌లో 64 ఎంపీ కెమెరా, 20 ఎంపీ నైట్ విజన్ కెమెరా, 2 ఎంపీ మైక్రో సెన్సార్ వంటి ట్రిపుల్ కెమెరా వ్యవస్థ ఉంటుంది.
ఇంకా ఈ ఫోన్‌కు ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్, ఐపీ69కే డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ లభించింది.
ఎంఐఎల్ ఎస్‌టీడీ 810 హెచ్ రేటింగ్ ఉంది. అంటే మీరు ఈ ఫోన్‌ను ఏ క్లైమెట్‌లో అయినా ఉపయోగించొచ్చు.
కంటిన్యూగా 12 గంటలు వీడియోలు చూడొచ్చు.
ఫోన్‌లో ప్రాసెసర్ విషయానికి వస్తే.. కంపెనీ ఇందులో హీలియో జీ99 చిప్‌సెట్‌ను అమర్చింది. ఇది 6 ఎన్ఎం ప్రాసెసర్.
12 జీబీ ర్యామ్ ఉంటుంది. 256 జీబీ మెమరీ ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు సపోర్ట్ చేస్తుంది.
66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఎన్ఎఫ్‌సీ, జీఎన్ఎస్ఎస్ పొజిషనింగ్, బ్లూటూత్ 5.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫోన్ పని చేస్తుంది.
మార్కెట్‌లోకి వచ్చిన ఈ కొత్త ఫోన్ పేరు ఔకిటెల్ డబ్ల్యూపీ21. ఇది పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్. ఇందులో భారీ బ్యాటరీ ఉంటుంది. అంటే దీని కెపాసిటీ ఏకంగా 9800 ఎంఏహెచ్. మనం మన ఫోన్లలో దాదాపు 5 వేల నుంచి 7 వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని చూసి ఉంటాం. కానీ ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 9800 ఎంఏహెచ్ అంటే మీరే ఆలోచించండి.