మా ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది – ఎమ్మెల్సీ కవిత

-

రాజకీయాలలో మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత్ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాజకీయాలలోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్ లో ఉందని.. దాన్ని ఆమోదించి చట్టంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ధరణిలో సగం.. ఆకాశంలో సగం.. అవకాశంలోనూ సగం కావాలని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్లు సాధించేవరకు పోరాట బాట విడిచేది లేదని స్పష్టం చేశారు. తాను చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. తాము చేపట్టిన ఆందోళన ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని.. మోడీ ప్రభుత్వం తలుచుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చిన్నగా మొదలైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత.

Read more RELATED
Recommended to you

Latest news