IND vs pak : ఫైనల్ జట్టును ప్రకటించిన పాకిస్తాన్

క్రికెట్‌ అభిమానులు  ఎంతగానో ఎదురుచూస్తున్న టీ 20 ప్రపంచకప్ బిగ్ ఫైట్.. టీమిండియా  వర్సెస్‌ పాకిస్థాన్ బిగ్ ఫైట్‌కు సమయం దగ్గర పడింది.  అరబ్ గడ్డ పై అదిరిపోయే క్రికెట్​ హంగామా.. గ్రాండ్​ గాలా నైట్స్‌లో మోతెక్కనున్న పరుగుల ఆట‌‌ రేపు ప్రారంభం   కానుంది. ఈ మ్యాచ్  దుబాయ్ లోని ఇంటర్నేషనల్.  క్రికెట్ మైదానంలో రేపు రాత్రి హైవోల్టేజ్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో

రేపు జరుగనున్న ఇండియా మరియు పాకి స్థాన్‌ మ్యాచ్‌ కోసం పాకి స్థాన్‌ జట్టు ను పాక్‌ క్రికెట్‌ బోర్డు కాసేపటి క్రితమే ప్రకటించింది. బాబర్‌ అజామ్‌ నేతృత్వంలో.. ఆసీఫ్‌ అలీ, ఫఖర్‌ జమాన్‌, హైదర్‌ అలీ, మహ్మద్‌ రిజ్వాన్‌, ఇమద్‌ వసీమ్‌, మహమ్మద్‌ హపీజ్‌, షాదాబ్‌ ఖాన్‌,, మాలిక్‌, హరీష్‌, రాఫ్‌, హసన్‌ అలీ, షాహీన్‌ షా అఫ్రిధి ఉన్నారు. ఇక ఇండియా జట్టును ఇంకా ప్రకటించలేదు.