పాక్ సంచలన నిర్ణయం.. పబ్జీ బ్యాన్..!

-

ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంపాదించుకున్న పబ్జీ గేమ్‌ ను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ టెలి కమ్యూనికేషన్ అథారిటీ ప్రకటించింది. పబ్జీ గేమ్ కు యువత బానిసలాగా మారుతుంది. గంటలతరబడి ఈ గేమ్ లో మునిగితేలుతున్నారు. దీనివల్ల ఎంతో మంది ఆత్మహత్యకు కుడేయ పాల్పడుతున్నారు.. మరి కొంత మంది అయితే పబ్జీ ఆడొద్దు అన్నందుకు ఇతరులను సైతం చంపుతున్నారు.

తాజగా.. పబ్జీ గేమ్‌ లో మిషన్ పూర్తి చేయడంలో విఫలం కావడంతో 16 ఏళ్ల పాకిస్థాన్ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ గేమ్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్లు మరింత పెరగడమే కాక, లాహోర్ హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు… దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో, ఈ గేమ్ ను తాత్కాలికంగా బ్యాన్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news