ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు టీడీపీ సీనియర్ నాయకుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. అనంతరం ఆయనని విజయవాడ సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
అయితే తాజాగా అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తనను అర్థంతరంగా గుంటూరు జనరల్ ఆస్పత్రి నుంచి జైలుకు తరలించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనని హాస్పిటల్ కి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం రేపు విచారించనున్నట్లు తెలిపింది.