డ్రగ్స్ తీసుకుంటూ భార్యకు పట్టుబడ్డ పాక్ క్రికెటర్..!

-

పాకిస్తాన్ పేస్ గ్రేట్ మరియు మాజీ కెప్టెన్ వసిం అక్రమ్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయ్యాక కొకైన్ కు బానిస అయ్యానని వెల్లడించారు. 2009లో తన మొదటి భార్య మరణంతో కొకైన్ వాడకాన్ని విడిచి పెట్టాడు. 56 ఏళ్ల వసిం అక్రమ్ తన ఆత్మకథ ‘సుల్తాన్: ఏ మేముయిర్’ లో ఈ విషయం గురించి చెప్పుకొచ్చారు.

తన మొదటి భార్య హూమా కు దూరం అవుతున్న సమయంలో తాను చాలా చవి చూశానని వసిం అక్రమ్ చెప్పుకొచ్చాడు. “దక్షిణాసియా దేశాల సాంస్కృతిని పరిశీలిస్తే, ఒక్కసారి గొప్ప పేరు వచ్చిందంటే అది మిమ్మల్ని తినేస్తుంది, మైకంలో ముంచేస్తుంది, మిమ్మల్ని అవినీతిపరులుగాను మార్చేస్తుంది. ఇక్కడ ఒక్క రాత్రిలో పది పార్టీల్లో పాల్గొనే వాళ్లు ఉంటారు కూడా. ఈ సాంస్కృతి నాపైన తీవ్ర ప్రభావం చూపింది. కానీ నా భార్య హూమా అనారోగ్యంతో బాధపడుతూ చివరి క్షణాల్లో పడిన వేదన చూసాక నేను మళ్ళీ డ్రగ్స్ జోలికి వెళ్లలేదు. తాను స్పృహలో లేకపోయినప్పటికీ నాలో మార్పు తీసుకువచ్చింది. ఆ తర్వాత నేనెప్పుడూ పతనం కాలేదు” అని అక్రమ్ తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news