పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ ను అవిశ్వాసం ద్వారా గద్దె దించిన తర్వాత… పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ ను ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా బలపరిచాయి. దీంతో ఆయన పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత్ గురించి సంబంధాల గురించి పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రస్తావించారు. భారత్ తో మంచి సంబంధాాలను కోరుకుంటున్నామని… అయితే కాశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం లేకుండా అది జరగదని షరీఫ్ అన్నారు. ప్రతీ అంతర్జాతీయ వేదికపై కాశ్మీర్ సమస్యను లేవనెత్తుతామని పాక్ నైజాన్ని మరోసారి బయటపెట్టారు. భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు కూడా పేదరికంతో బాధపడుతున్నాయిని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని… జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ప్రధాని మోదీ ముందుకురావాలని పిలుపునిచ్చాడు. దీని తరువాత కాశ్మీర్ సమస్యపై కలిసి పోరాడుదాం అంటూ వ్యాఖ్యానించారు. అంతకు ముందు పాకిస్తాన్ 22 కోట్ల ప్రజలను దేవుడు రక్షించాడని… దేశంలో అవిశ్వాసం నెగ్గడం ఇదే తొలిసారని… ప్రజలు ఈ రోజును ఉత్సవంగా జరుపుకుంటున్నారని అన్నారు.