తలలో మేకుని దిగ్గొట్టుకుంటే కొడుకు పుడతాడని సాధువు చెప్పడంతో అలా చేసింది.. ఆఖరికి..?

-

మూఢనమ్మకాలు ఇంకా రోజు రోజుకు ఎక్కువవుతూనే ఉన్నాయి. మూఢనమ్మకాలు కారణంగా చాలా మంది జీవితాన్ని ప్రమాదంలోకి పెట్టేస్తున్నారు. పాకిస్తాన్ కి చెందిన ఒక ఆమె సాధువు చెప్పినట్లు వినండి. ఆఖరికి ఆమె ప్రాణాలే ప్రమాదంలో పడ్డాయి. ఇక అసలు ఏమైంది అనేది చూస్తే… ఒక నిండు గర్భిణీ సాధువు చెప్పారని మేకుని తన తలలోకి దిగ్గొట్టుకుంది.

అయితే ఇలా చేస్తే కచ్చితంగా ఆమె కి కొడుకు పుడతాడని ఆ సాధువు ఆమెతో చెప్పినట్లు డాక్టర్ చెప్పారు. బుధవారం నాడు దీనికి సంబంధించిన విషయాలు డాక్టర్ చెప్పడం జరిగింది. పాకిస్తాన్ లో ముస్లిం ప్రజలు ఇలాంటి వాటిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. నార్త్ వెస్ట్రన్ సిటీ పెషావర్ ఆసుపత్రికి ఆమె వచ్చింది. ఆమె ఒక మేకుని తన తలలోకి దికొట్టుకున్నట్లు డాక్టర్లు చెప్పారు.

ఆమె స్పృహలోనే ఉన్నప్పటికీ చాలా తీవ్రమైన నొప్పితో ఆమె ఆస్పత్రికి వచ్చింది. ఆ తర్వాత డాక్టర్లు ఆ మేకుని తొలగించారు. అయితే ఆమెకి ముగ్గురు ఆడ పిల్లలు వున్నారు. ఈసారి కూడా ఆడపిల్ల కడుపులో ఉందేమో అని ఆమె సాధువు చెప్పినట్టు చేసింది అని.. ఇలా చేస్తే మగపిల్లవాడు పుడతాడని సాధువు చెప్పాడని డాక్టర్లు చెప్పారు. ఆమె ఐదు సెంటీమీటర్ల మేకుని తలలోకి దిగ్గొట్టుకుంది. అదృష్టవశాత్తు మెదడుకు తగల్లేదు. పోలీసులు అతని కోసం ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news