వీరాభిమానం అంటే ఇదే..ఆలియా భట్ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన యాక్టర్..

-

సినిమా హీరో, హీరోయిన్స్‌కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపైన వారి నటనను చూసి వారిని దేవుళ్లలాగా ఆరాధిస్తుంటారు ప్రేక్షకులు. అలా బాలీవుడ్ క్యూట్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఆలియా భట్ సినిమాల పట్ల ఆరాధన పెంచుకున్న ఓ అభిమాని చేసిన పని గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆలియా భట్ నటించిన ‘గంగుబాయి కతియావాడి’ చిత్రం చూసేందుకు థియేటర్ మొత్తం బుక్ చేసుకున్నాడు ఆ అభిమాని. సదరు వ్యక్తి కూడా కూడా యాక్టర్ కావడం విశేషం. ఈ సంఘటన పాకిస్థాన్‌లో జరిగింది.

 

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రం గత నెల 25న విడుదలై సక్సెస్ అయింది. బాక్సీఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఈ ఫిల్మ్‌లో ఆలియా భట్ లీడ్ రోల్ ప్లే చేసింది. మాఫీయా క్వీన్, వేశ్యగా ముంబైలోని కామాటిపుర ప్రాంతానికి చెందిన మహిళ ఆలియా చాలా చక్కగా నటించిందని ప్రేక్షకులతో పాటు విమర్శకులు ప్రశంసించారు. అందం, అభినయంతో ఆలియా తన సత్తా మరో సారి చాటుకుంది.

ఈ క్రమంలోనే ఈ చిత్రం చూసేందుకు పాకిస్థాన్‌కు చెందిన మోడల్, యాక్టర్ మునీబ్ బట్.. ‘గంగుభాయి కతియావాడి’ సినిమా చూసేందుకు థియేటర్ మొత్తం బుక్ చేశాడు. ఈ విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలుపుతూ పోస్ట్ పెట్టాడు. దాంతో ఆ పోస్టు నెట్టింట తెగ వైరలవుతోంది. అది చూసి నెటిజన్లు ఆలియా భట్ ఫ్యాన్ పేజీల్లో షేర్ చేస్తున్నారు.

‘వీరాభిమాని అంటే ఇతను, వీరాభిమానం ఇదే’ అనే కామెంట్స్ చేస్తున్నారు. తన భార్యతో కలిసి పిక్చర్ చూసేందుకు ఇలా తాను టాకీసు మొత్తం బుక్ చేసుకున్నట్లు మునీబ్ బట్ తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, హ్యూమా ఖురేషి, ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే ఆలియా భట్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news