బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ లో ఎక్కువ మంది అభిమానులు ఉన్న జట్టు అంటే.. చెన్నై సూపర్ కింగ్స్ అనే చెబుతారు. టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని.. ఈ జట్టుతో ఉండటమే కాకుండా.. ఇప్పటి వరకు కెప్టెన్సీ బాధ్యతల్లో కూడా ఉన్నాడు. అయితే తాజా గా ఈ రోజు తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని మహేంద్ర సింగ్ ధోని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగ చెన్పై సూపర్ కింగ్స్ తర్వాతి కెప్టెన్ గా తన శిష్యుడు రవీంద్ర జడేజా ఉంటాడనే ప్రకటన కూడా వచ్చింది.
కాగ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైనా రవీంద్ర జడేజా ఫస్ట్ రియాక్షన్ ను జట్టు యాజమాన్యం ట్విట్టర్ తో పంచుకుంది. జడేజా మాట్లాడుతున్న ఒక్క వీడియోను ట్విట్టర్ లో పంచుకుంది. కాగ ఈ వీడియోలో సర్ జడ్డు.. ఐపీఎల్ లో ఇంత పెద్ద జట్టుకు కెప్టెన్ గా ఉండటం సంతోషంగా ఉందని అన్నారు. కానీ ఇదే సమయంలో తనపై పెద్ద బాధ్యత పడిందని గుర్తు వస్తుందని అన్నాడు.
అయితే తన వెనక ధోని ఉన్నాడని అన్నాడు. ధోని ఉంటే భయం లేదని అన్నాడు. ధోని కేవలం కెప్టెన్సీ బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకున్నాడని అన్నాడు. కానీ సీనియర్ ఆటగాడిగా పెద్దన్న పాత్ర ఉంటుందని అన్నాడు. ఈ ఐపీఎల్ లో ధోని సలహాలతో ముందుకు వెళ్తానని జడేజా అన్నాడు.
📹 First reactions from the Man himself!#ThalaivanIrukindran 🦁💛 @imjadeja pic.twitter.com/OqPVIN3utS
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022