భువనాలన్నీ జై కొట్టాయి
గగనాలే ఛత్రం పట్టాయి
భళిరా భళి సాహోరే బాహుబలి
అని ఆ రోజు పాడుకున్నాం
మళ్లీ ఈ రోజు కూడా పాడుకుంటున్నాం
ఆ పాటకు కొద్దిపాటి మార్పులు కూడా లేవు ఇవాళ
2015లో కాలం 2022లో కాలం అంతే మార్పు
కాలంలో వచ్చిన మార్పు కీర్తిలో రాని మార్పు
అప్పటికీ ఇప్పటికీ రాజమౌళి ద గ్రేట్
రాజమౌళి అనే దర్శక దిగ్గజం నుంచి వచ్చిన ట్రిపుల్ ఆర్..ఎన్నో ప్రత్యేకతల మేళవింపు..మట్టిలో దాగి ఉన్న వీరుల కథ నిష్కంళక చరిత..రాయాలి..వినాలి..పాడాలి..ఆత్మగానం విలువ చాటాలి..అనండిక! మళ్లీ సాహోరే రాజమౌళి అని..!సాహోరే తారక్ అని..!సాహోరే చరణ్ అని! ఆర్‌ఆర్‌ఆర్…మరికొద్ది గంటల్లో తెరమీదకు రాబోతోంది ..మనలోకం న్యూస్ మీడియా ప్రత్యేకించి పాఠకులకు అందిస్తున్న ఫస్ట్ రివ్యూ ఇదే…! చదవండిక !
భారతీయ సినిమా ఇప్పుడు పెద్ద పెద్ద కలలను కంటోంది. తెలుగు సినిమా ఆ కలలకు కొనసాగింపు ఇస్తోంది. జేజేలు అందుకుంటోంది. బాహబలి అనే ఓ అనూహ్య విజయాన్ని నమోదు చేసి ఆ రోజు రికార్డుల మోత మోగించింది. ఇప్పుడు తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌గా రూపాంతరం చెంది,సంబంధిత పరిణామ గతికి అర్థం చెబుతూ..విశ్వరూపం చూపించబోతుంది.
విశిష్టత చాటనుంది. ఈ నేపథ్యాన సినిమా ఎలా ఉంది. అంచనాలను అందుకుంటుందా? సంచలనాలను సృష్టించనుందా? ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మరికొన్ని గంటల్లో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్న తరుణంలో సగటు సినీ ప్రేక్షకుడు లేదా ప్రేక్షకురాలి మదిలో మెదిలే భావాలివి.
కొమురం భీముడిగా ఎన్టీఆర్…అల్లూరి సీతారాముడిగా చరణ్ తమ నటనా కౌశలంతో అదరగొట్టారు. వీరిద్దరిదీ డెడ్లీ కాంబినేషన్ ..సినిమా స్థాయినీ, సన్నివేశ తీవ్రతనూ పెంచే స్థాయి. ఇక స్వరవాణి కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరైతే దద్దరిల్లిపోయింది. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అందించిన కట్టు తప్పని కథ మరియు కథనం.. వీటితో ఆకట్టుకునే భావోద్వేగం.. వీటిని బంధించే సెంథిల్ కెమెరా పనితనం ఇవన్నీ కలిసి సినిమా స్థాయిని పెంచాయి.
అందుకే ప్రపంచ స్థాయిలో ట్రిపుల్ ఆర్ అనే ఓ తెలుగు సినిమా ఓ క్లాసిక్. ఓ విజువల్ ఫీస్ట్..వాట్ నాట్ వాట్ ఎల్స్. అజయ్ దేవ్‌గన్ నటన ఈ సినిమాకొక స్పెషల్ ఎట్రాక్షన్..అందాల అలియాకు ఈ సినిమా ఒక కెరియర్ బెస్ట్. సినిమా స్థాయిని పెంచే పాటలు,ఉద్వేగాలు పండించే పాత్రలు..గొప్ప కథకు శక్తిమంతమయిన నేపథ్యం ఇంకా ఇంకొన్ని ఆకర్షణలు కలిస్తే ఆర్ఆర్ఆర్..రౌద్రం..రణం..రుధిరం..