అందాల రాశితో ‘పక్కా కమర్షియల్’గా వచ్చేస్తున్న గోపీచంద్..సాంగ్ ప్రోమో ఔట్

-

టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ ఇటీవల కాలంలో సాలిడ్ హిట్ అందుకోలేదు. ‘‘సీటీ మార్’’ ప్రేక్షకుల మెప్పు పొందినప్పటికీ అనుకున్న స్థాయి ఆదరణ లభించలేదు. కాగా, ఈ సారి ‘‘పక్కా కమర్షియల్’’ గా రాబోతున్నాడు గోపీచంద్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘‘పక్కా కమర్షియల్’’ సినిమాతో ఈ సారి డెఫినెట్ గా హిట్ ఖాతాలో వేసుకుంటాడని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి ఖన్నా ఈ పిక్చర్ లో హీరోయిన్ కాగా, తాజాగా మేకర్స్ ‘‘అందాల రాశి మేకప్ వేసి..నా కోసం వచ్చావే ’’ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. వచ్చే నెల 1న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 1న సినిమా విడుదల కానుంది.

జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర టైటిల్ సాంగ్ కు లిరిక్స్ దివంగత లిరిసిస్ట్ పద్మ శ్రీ ‘‘సిరివెన్నెల’’ సీతారామ శాస్త్రి అందించారు. ఆ పాటకు చక్కటి స్పందన లభిస్తోంది. హీరో గోపీచంద్ సైతం ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news