పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పై విపక్షాలు దుష్ప్రచారం: నిరంజన్ రెడ్డి

-

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ  మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్ట్ ను అడ్డుకునేందుకు విపక్షాలు విశ్వప్రయత్నాలు చేశాయని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ను జూరాల నుంచి ప్రారంభించాలని.. తొలుత విపక్షాలు వాదించాయని.. అటవీ ప్రాంతంలో ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని ఫిర్యాదు చేశాయని పేర్కొన్నారు.

విపక్షాలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. చివరికీ గ్రీన్ ట్రైబ్యునల్ సైతం ఫిర్యాదు చేశాయి. అన్ని విఘ్నాలు దాటుకొని ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రాజెక్ట్ రీ డిజైన్ తో ముంపు ప్రాంతాలు పరిధి తగ్గిందని.. తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా కేసీఆర్ ధృష్టి సారించాని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎవరూ ఎన్ని కుట్రలు చేసినా మా ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని.. ఈ ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము తిప్పికొట్టి విజయవంతంగా ప్రాజెక్ట్ ప్రారంభించుకున్నామని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news