పంటనష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకుంటాం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

-

తెలంగాణ ప్రభుత్వం రైతు సర్కార్.. కేసీఆర్ రైతుల పక్షపాతి. అన్నదాతలు నష్టపోతుంటే బీఆర్ఎస్ సర్కార్ చూస్తూ ఊరుకోదు అని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షానికి ఎన్నో వేల ఎకరాల పంట నష్టపోయిందని తెలిపారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నష్టపోయిన పంటపొలాలను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని.. పంట నష్టం అంచనాలు పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపడతామని పల్లా వెల్లడించారు.

‘పంటనష్టంపై గతంలో కేంద్రానికి ఎన్నిసార్లు అంచనాలు పంపినా నిధులు ఇవ్వలేదు. గతంలో రూ.7 వేల కోట్లు నష్టం వాటిల్లిందని ప్రతిపాదనలు పంపితే కేవలం రూ.300 కోట్లు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాలకు కేంద్రం ఏ రకంగాను సహాయపడట్లేదు. పీఎం ఫసల్‌ బీమా యోజన వల్ల రైతులకు నష్టం జరుగుతోంది. బీమా కంపెనీలకు లాభం జరుగుతోంది.
పీఎం ఫసల్‌ బీమా యోజన పథకం నుంచి గుజరాత్‌ రాష్ట్రం కూడా తప్పుకుంది. – పల్లా రాజేశ్వర్ రెడ్డి, రై.స.స అధ్యక్షుడు

Read more RELATED
Recommended to you

Latest news