ప్రముఖ నటి ఆత్మహత్య… తన అపార్ట్మెంట్ లో ఉరేసుకుని….

-

ప్రముఖ బెంగాళీ టీవీ నటి పల్లవి డే ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. దక్షిణ కోల్ కతాలోని తన అద్దె అపార్ట్మెంట్ లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. 21 ఏళ్ల పల్లవిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినా లాభం లేదు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. పల్లవి దక్షిణ కోల్ కతాలోని గార్పా ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటోంది.


పల్లవి ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ కలిసి అదె అపార్ట్మెంట్ లో కలిసి నివసిస్తున్నారు. అపార్ట్ కేర్ టేకర్ విలేకరులతో మాట్లాడుతూ.. బెడ్ రూమ్ లో ఆమె ఉరేసుకున్న తరువాత ఆమెతో నివసిస్తున్న వ్యక్తి గట్టిగా అరిచాడని… హౌజ్ కీపింగ్ సిబ్బందితో కలిసి ఆమె మృతదేహాన్ని కిందకు దించాడని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడని కేర్‌టేకర్ చెప్పారు. పల్లవి ‘కుంజ ఛాయా’, ‘రేషమ్ ఝాపి’ మరియు ఇటీవల ‘మోన్ మనే నా’ వంటి అనేక బెంగాలీ సబ్బుల యాడ్స్ లో ఫిమేల్ లీడ్ గా నటించింది. పోలీసులు ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్ ను ప్రశ్నిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news