రాజకీయ వారసత్వంలో భాగంగా ఇద్దరూ ప్రముఖ కుటుంబాల నుంచి వచ్చిన వారే ! కానీ ఒకరు వేగంగా వెళ్తున్నారు ఒకరు నెమ్మదిగా నడుస్తున్నారు. కేసీఆర్ కొడుకుది పరుగు. వైఎస్సార్ కొడుకుది నడకప. అంతే తేడా ! ఇదే తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా వినిపిస్తున్న మరియు కనిపిస్తున్న భేదాలు. వాస్తవానికి కేటీఆర్ త్వరిగతిన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. 2004 నుంచి ఉన్నా కూడా ఉద్యమంలో మాత్రం 2006 కాలం నుంచి బాగా యాక్టివ్ అయ్యానని చెప్పుకుంటారు.
ఆ విధంగా కేటీఆర్ స్థిర నాయకత్వ లక్షణాలు వచ్చేయి. కానీ కేటీఆర్ కన్నా జగన్ చాలా లేటుగానే ముఖ్యమయిన పదవులు అందుకోవడం కానీ ముఖ్యమంత్రి పదవి అందుకోవడం కానీ చేశారు. 2014లో తెలంగాణ ఏర్పాటయిన దగ్గర నుంచి బాగా కీలకంగా మారేరు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వివిధ శాఖలు నిర్వహిస్తూ పేరు తెచ్చుకున్నారు. పురపాలక శాఖ, ఐటీ శాఖ ఇలా పలు శాఖలకు బాధ్యతలు నిర్వర్తించి తనదైన పేరు తెచ్చుకున్నారు.
కానీ జగన్ అలా కాదు. ఆయన కూడాఎంపీగానే రాజకీయ జీవితం ప్రారంభించినా తరువాత కాలంలో ఆయన ఎన్నో ఒడిదొడుకులు చూశారు. నాన్న మరణం తరువాత ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. సవాళ్ల పరంగా చూస్తే కేటీఆర్ కు రాజకీయ జీవితం ఓ వడ్డించిన విస్తరి. జగన్ కు కూడా మొదట్లో అదే విధంగా ఉండేది. కానీ తరువాత తరువాత నాన్న మరణం తరువాత ఆయనకు కొత్త సవాళ్లు వచ్చిపడ్డాయి. ఏదేమయినప్పటికీ సొంతంగా తనకంటూ ఓ పార్టీ ప్రారంభించి, ప్రత్యేకించి ఓ ప్రభ అందుకుని ముందుకు వెళ్తున్నారు జగన్.
అయితే ముఖ్యమంత్రి అయ్యాక జగన్ బాగా నెమ్మదించారు. ముఖ్యంగా జగన్ ఓ పారిశ్రామిక వేత్తగా నాన్న వైఎస్సార్ హయాంలో చక్రం తిప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు బెంగళూరు కేంద్రంగా కూడా వ్యాపారాలు చేసి పేరు తెచ్చుకున్నారు. కేటీఆర్ కు నేరుగా వ్యాపారం చేసిన అనుభవం అయితే లేదు. కానీ బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేయడంతో కొన్ని విషయాలు సులువుగా అర్థం చేసుకోగలిగారు.
ఏదేమయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంత వేగంగా ఇవాళ జగన్ లేరు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వేగం తగ్గిపోయింది. అంతేకాదు వ్యాపార సూత్రాల అమలు కూడా లేదు. ఆ మాటకు వస్తే ఎంఏ ఎకనామిక్స్ చేసిన చంద్రబాబు కన్నా ఓ అడుగు వెనుకే ఉన్నారు జగన్. ఇంకా చెప్పాలంటే ఇంతవరకూ పారిశ్రామిక విధానం అంటూ ఒకటి స్పష్టంగా ప్రకటించి అమలు చేసిన దాఖలాల్లో కేటీఆర్ ముందున్నా జగన్ మాత్రం ఆయన వేగాన్ని అందుకోలేకపోయిన దాఖలాలు అనేకం ఉన్నాయి. కనుక దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం పేరిట జరిగే సభలూ సమావేశాలూ అన్నవి రాష్ట్రానికి ఏమయినా ఉపయోగపడితే మేలు. మన రాష్ట్ర ప్రజలు, అవకాశాలు అన్నవి సమర్థరీతిలో జగన్ వివరిస్తే ఇంకా మేలు.