రూ.1,000 ఫైన్ కట్టినా కూడా పాన్ ఆధార్ లింక్ అవ్వడం లేదా..? అయితే ఇలా చెయ్యండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు ప్రతీ ఒక్కరికి కూడా తప్పక ఉండాలి. అయితే పాన్ కార్డు కూడా చాలా ముఖ్యం. పాన్, ఆధార్ నెంబర్లు లింక్ ని చేసుకోవడం తప్పనిసరి. అయితే ఈ గడువు ని ఎక్స్టెండ్ చేసారు. 2023 మార్చి 31 గా ఉన్న గడువును 2023 జూన్ 30 వరకు పొడిగించడం జరిగింది. దీనితో మరో మూడు నెలలు అవకాశం వచ్చింది.

అప్పట్లోగా రూ.1,000 జరిమానా చెల్లించి పాన్, ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఇప్పటికే రూ.1,000 ఫైన్ కట్టినవారు పాన్ ఆధార్ లింక్ చెయ్యడానికి అవ్వట్లేదు. సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. రూ.1,000 ఫీజు చెల్లించినా పాన్, ఆధార్ లింక్ చేయలేకపోతున్నామని సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తున్నారు. పాన్, ఆధార్ లింక్ కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పేరు మ్యాచ్ కాకపోవడమే. పాన్ కార్డు లో ఆధార్ కార్డు లో పేరు ఒకేలా ఉండేలా చేసుకోండి.

అప్పుడు మీ పాన్ ఆధార్ లింక్ అవుతాయి. ఆదాయపు పన్ను శాఖ డేటా బేస్‌లో, ఆధార్ డేటాబేస్‌లో పేర్లు మ్యాచ్ అయితేనే ఈ రెండూ లింక్ అవుతాయి. లేదంటే అవ్వదు. మీ ఆధార్ కార్డులో పేరు సరిగ్గా ఉంటే, ఆధార్‌లో ఉన్నట్టుగానే పాన్ కార్డులో పేరు మార్చుకోవాలి. పాన్ కార్డులో పేరు కరెక్ట్‌గా ఉంటే ఆధార్ కార్డులో మార్చండి. అలానే పుట్టిన తేదీ మ్యాచ్ కాకపోయినా పాన్, ఆధార్ లింక్ అవ్వవు. కొన్ని కొన్ని సార్లు
సాంకేతిక సమస్యల కారణంగా పాన్, ఆధార్ లింక్ అవ్వడం లేదు. ఇ-పే ట్యాక్స్ ద్వారా పేమెంట్ చేస్తే ఇ-ఫైలింగ్ పోర్టల్‌ లో అప్‌డేట్ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. సోపేమెంట్ పూర్తి చేసిన ఓ నాలుగు రోజుల తర్వాతే పాన్, ఆధార్ లింక్ చేయడానికి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news