ప్రపంచంలో ఎన్నో దేశాలలో భారతదేశానికి చెందిన ఎందరో మేదావులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు అత్యున్నత పదవులను సాధించి మన దేశ ప్రతిష్టను ఎంతో ఎత్తుకు తీసుకువెళుతున్నారు. తాజాగా మరొక అత్యున్నత పదవిని భారత సంతతికి చెందిన వ్యక్తి దక్కించుకుని భారతీయులు అంతా గర్వంగా ఫీల్ అయ్యేలా చేశాడు. వరల్డ్ బ్యాంక్ చీఫ్ గా అమెరికాకు చేదిన భారత సంతతికి చెందిన వ్యక్తి అజయ్ బంగా నియామకం ఏకపక్షం అయినట్లు తెలుస్తోంది.
ఈ పదవి కోసం ఇతర దేశాల నుండి ఎటువంటి ప్రతిపాదనలు రాకపోవడంతో… అప్పటికే అజయ్ బంగా ఒక్కడే నామినేషన్ వేయడంతో ఇతనిని వరల్డ్ బ్యాంక్ చీఫ్ గా నియమించనున్నారు. కాగా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ చీఫ్ గా ఉన్న డేవిడ్ మల్పాస్ సంవత్సరం క్రిందటే తన పదవీ విరమణ గురించి తెలియచేయడంతో త్వరలోనే అజయ్ బంగా చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.