టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఏపీ మంత్రి రోజా సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు. స్కిల్ అంటే ఏమిటో తెలియని రోజా స్కిల్ డెవలప్ మెంట్ గురించి నోటికొచ్చినట్టు మాట్టాడుతోందని మండిపడ్డారు.
రోజా ఆగడాలు తట్టుకోలేక ఆమెను మట్టుపెట్టాలని తోటి మంత్రులే ఆలోచిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. స్కిల్ అంటే ఏంటో తెలియని మంత్రి రోజా నోటికొచ్చినట్టు మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. రోజా ఎస్సీ ఎస్టీల భూముల్లో పరిహారం పేరుతో ఎంత మింగిందో, దేవుడి భూముల్ని కాజేయడానికి ఎలా ప్రయత్నిస్తుందో, ఇసుకదోపిడీలో ఎంత మింగిందో, ఒకప్పుడు చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కొని నేడు 20 వరకు విలాసవంతమైన కార్లు ఎలా సంపాదించిందో, ప్రజల సొమ్ముతో ఎలా కులుకు తుందో అందరికీ తెలుసు అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కీలక వ్యాఖ్యలు చేశారు. సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ దుర్మార్గులకు 144 సెక్షన్ వర్తించదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని… ఆయన మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు.