వైరల్ : నాన్నమ్మతో క‌లిసి “శ్రీ వల్లి” పాట‌కు పాండ్యా డాన్స్..

-

ప్రస్తుతం ఇండియాలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరికీ పుష్ప సినిమా ఫోబియా పట్టుకుంది. చాలామంది పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కు అల్లు అర్జున్ మాదిరిగా చెప్పులతో డ్యాన్స్ చేస్తూ అదరగొడుతున్నారు. ముఖ్యంగా క్రికెటర్లు పుష్ప సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ అందరిని అలరిస్తున్నారు. అటు విదేశీ క్రికెటర్లు కూడా పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కు స్టెప్పులు వేస్తున్నారు.

ఇక తాజాగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తో ఆయన నానమ్మ శ్రీవల్లి పాటకు స్టెప్పులేసింది. వయసు సహకరించక పోయినా మనువడితో.. కలిసి శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి హార్దిక్ పాండ్యా నానమ్మ అదరగొట్టింది. అల్లు అర్జున్ మాదిరిగా పాండ్యా తో కలిసి కాలు కదిలించింది. చివరగా తగ్గేదే అనే మేనరిజం తో విజయంతో ముగించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news