వైష్ణవ్ తేజ్ తర్వాతి సినిమా జాతిరత్నాలు డైరెక్టర్ తో..?

-

కరోనా తర్వాత థియేటర్లకి జనాలని తీసుకువచ్చిన సినిమాల్లో ఉప్పెన, జాతి రత్నాలు మొదటి రెండు స్థానాల్లో ఉంటాయి. పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. సినిమా వచ్చి నెల దాటిపోతున్నా ఇప్పటికీ దాని హవా కొనసాగుతూనే ఉంది. తాజాగా రిలీజైన జాతి రత్నాలు సైతం దూసుకుపోతుంది. విడుదలైన ప్రతీ చోటా హౌస్ ఫుల్ కలెక్షన్లతో కనక వర్షం పండిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమాతో దర్శకుడు అనుదీప్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అనుదీప్ తో సినిమా తీసేందుకు నిర్మాతలందరూ రెడీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ తో అనుదీప్ దర్శకత్వంలో సినిమా రాబోతుందని తెలుస్తుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా అనుదీప్ దర్శకుడిగా పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా రూపొందిస్తున్నారట. ఈ మేరకు అధికారిక సమాచారం రానప్పటికీ, ఇండస్ట్రీలో వినబడుతుంది. మరి ఈ సారి కూడా జాతి రత్నాలు సినిమాలాగా నవ్విస్తాడో లేదా మరో కొత్త జోనర్ తో ముందుకు వస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news