పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలి – కోదండరామ్

-

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ పై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యువజన జన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత మల్లు రవి, ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, బీఎస్పీ నుంచి అరుణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరా మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ వ్యవహారం అనేది కేవలం ప్రవీణ్, రాజశేఖర్ ది కాదన్నారు.

పేపర్ సెట్టింగ్ కి, ప్రింటింగ్ కు బాధ్యత చైర్మెన్ దేనన్నారు. సిట్ జారీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని.. సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపితేనే మావద్ద ఉన్న ఆధారాలు ఇస్తామని అన్నారు. బలమైన హస్తం లేకుండా పేపర్ లీకేజీ కాదన్నారు కోదండరాం. కేవలం ఇద్దరు కలిసి లీక్ చేయలేదని అన్నారు. పేపర్ లీకేజీని అరికట్టడం కోసం ప్రత్యేక చట్టం తేవాలన్నారు. చాలా సింపుల్ గా మెటీరియల్ ఇస్తాం, ఫుడ్ పెడతాం అంటే కుదరదు అన్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని సీట్ కి ఇవ్వడం వల్ల ఏం లాభం లేదని.. సిబిఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news