చిన్నప్పుడు పిల్లలు వేటిని నేర్చుకుంటారో వాటినే అనుసరిస్తూ ఉంటారు అందుకనే తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడు మంచి నేర్పాలి. పైగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మంచి నేర్పాలని అనుకుంటూ ఉంటారు కనుక కాస్త సమయం వారితో కేటాయించి మంచే తెలపండి.
మీ పిల్లలని మంచిగా తీర్చిదిద్దాలని మీరు అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా వాళ్ళకి ఇవి నేర్పించండి దీంతో వాళ్లు పెద్దయ్యాక కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోవడం అందరితో మంచిగా ప్రవర్తించడం లాంటివి చేస్తారు. మరి పిల్లలకు వేటిని నేర్పాలి అనేది ఇప్పుడు చూద్దాం.
పిల్లలకి దయాగుణం అలవాటు చేయాలి. ఇతరులు భావాలని వాళ్లు అర్థం చేసుకునేలా తీర్చిదిద్దాలి. కాబట్టి పిల్లలకి సానుభూతి, దయాగుణం అలవాటు చేస్తూ ఉండాలి తల్లిదండ్రులు. దీనివల్ల వాళ్ళు ఇతరులకి సహాయం చేయగలుగుతారు. ఇతరుల గురించి కూడా మంచిగా ఆలోచిస్తారు.
ఎదుటి వాళ్ళ బాధ వాళ్ళకి అర్థమవుతుంది.
సానుభూతి ఎలా పిల్లలకు అలవాటు చేయాలి..?
తల్లిదండ్రులు చేసే రోజువారి పనులలో సానుభూతిని తెలియజేస్తూ ఉండాలి. పిల్లలు ఆరు నెలల వయస్సు నుండి ప్రతి ఒకటీ గమనిస్తూ ఉంటారు వారు అర్థం చేసుకునేలా తల్లిదండ్రులు ప్రవర్తిస్తే కచ్చితంగా పిల్లలకి అన్నీ అర్థమవుతాయి. మంచి తెలుస్తుంది.
తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు కనుక తల్లిదండ్రులు దయాగుణంతో ఉంటే పిల్లలకి కూడా అది అలవాటు అవుతుంది. అలానే పిల్లలకి అర్ధం అయ్యేలా ప్రతిరోజూ వాళ్లు చేసే పనులను బట్టి చూపిస్తే అవి పిల్లలకి కూడా అలవాటవుతాయి.