కీర్తి అనే అమ్మాయి చెడుతిరుగుళ్లు వద్దన్నందుకు కన్నతల్లినే చంపిన ఘటన అందరినీ కదిలించింది. ఈ జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉంటున్నారో చెప్పకనే చెప్పింది. మీరు కూడా అలా మీ పిల్లల చేతిలో హత్యకు గురికావద్దనుకుంటే.. ఇప్పటి నుంచి పిల్లలను జాగ్రత్తగా పెంచండి.
మీరు మంచి తల్లదండ్రులైతే మీ పిల్లల్ని స్మార్ట్ ఫోన్లకు దూరం చెయ్యండి. టీవీ, ఇంటర్ నెట్ పై వారు ఏమి చూస్తున్నారో ఒక కంట కనిపెట్టి వుండండి. పిల్లలతో మంచి పుస్తకాలను వారిచే చదివించండి.
వారితో కొంత సమయం గడపండి. వారితో స్నేహితుల్లా ఉంటే వారు మీ చెయ్యి దాటిపోకుండా వుంటారు. పిల్లలను లక్ష్య సాధన వైపు సాగిపోయ్యేందుకు వారికీ మంచి మార్గం చూపాలి.
కచ్చితంగా చందమామ, బాల మిత్ర నీతి కథలు చెప్పాల్సిందే. సత్య హరిశ్చంద్ర, రామాయణ, మహాభారత కథలు అర్ధం చేయించాల్సిందే. ఈ దేశం కోసం, ఈ జాతి బాగుకోసం ప్రాణాలర్పించిన వారి గాథలు చెప్పాల్సిందే. ఈ పని కేవలం అవగాహన కలిగిన పేరెంట్స్ మాత్రమే చెయ్యగలరు. మరి మీ సంగతేంటి..?