రివర్స్ టెండరింగ్ విషయంలో జగన్ ప్రబుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించిన రాజకీయ పక్షాలకు పరో క్షంగా ఎదురు దెబ్బతగిలింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కాంట్రాక్టుల విషయంలోప్రజా ధనాన్ని ఇబ్బడి ముబ్బడిగా దోచి పెట్టారంటూ.. జగన్ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు పైబడిన ప్రాజెక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. దీంతో విపక్షంలో ఉన్న చంద్రబాబు గగ్గోలు పెట్టారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ తన చేతకాని తనంతో రివర్స్‌లోకి నెట్టేశారని ఆరోపించారు.
ముఖ్యంగా పోలవరం జలవిద్యుత్ కంట్రాక్టు సహా రివర్స్ టెండరింగ్‌ను చంద్రబాబు తీవ్రంగా తప్పుబ ట్టారు. ఈ ప్రాజెక్టును అప్పటి బాబు ప్రభుత్వం నామినేషన్ పద్ధతిపై నవయుగకు అప్పగించింది. అయితే, దాదాపు 4 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును నామినేషన్‌పై ఎలా అప్పగిస్తారంటూ.. జగన్ ఈ ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. దీంతో మేఘా సంస్థ ముందుకు వచ్చింది. అయితే, ప్రభుత్వ రివర్స్ నిర్ణయంపై నవయుగ కోర్టుకు వెళ్లింది. దీంతో సుదీర్ఘ విచారణల అనంతరం జన్ కో తీసుకున్న నిర్ణయాన్ని ప్రబుత్వం ఎలా నిలిపి వేస్తుందని అప్పట్లో కోర్టు కూడా ప్రశ్నించింది.
అయితే, రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయలను ఆదా చేశామని, నామినేషన్ విధానంలో ఇంత భారీ ప్రాజెక్టు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం చేసిన వాదనను పరిగణన లోకి తీసుకున్న హైకోర్టు తాజాగా ఈ కేసుకు సంబంధించిన స్టేను ఎత్తి వేసింది. దీంతో ప్రభుత్వ వాదనే విజ యం సాధించింది. ఇక నుంచి మేఘా సంస్తే ఈ పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. ఈ పరిణామం అధికార పక్షం వైసీపీలో జోష్ పెంచగా.. విపక్షం టీడీపీలో నిర్వేదం కలిగించడం గమనార్హం.