ఆ విషయం పునరాలోచించుకోండి..ప్రతిపక్ష పార్టీలకి కేంద్రం విజ్ఞప్తి !

-

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను సమర్పించనుంది.. అలాగే ఈ ఏడాది కోవిడ్ కారణంగా కాగిత రహిత బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అంటే ఆర్థిక సర్వేతో పాటు అన్ని దస్త్రాలను కూడా ఆన్లైన్లో కేంద్రం పెట్టనుంది. ఇక గత ఏడాదిలాగే ఈ సమావేశాల్లో కూడా కొవిడ్ రూల్స్ స్ట్రిక్ట్గా అమలు కానున్నాయి. వేరు వేరు సమయాల్లో ఐదేసి గంటల పాటు లోక్సభ, రాజ్యసభ భేటీ కానున్నాయి. ఇక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం తిరిగి ప్రారంభం కానున్నట్లు చెబుతున్నారు. 

కొన్ని ఆర్డినెన్స్ ని చట్టాలుగా మార్చేందుకు కేంద్రం యత్నిస్తోందని అంటున్నారు. ఈ రోజు మొదలుకానున్న బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ ఎనిమిదో తారీకు వరకు జరగనున్నాయి. తొలివిడతలో ఫిబ్రవరి 15 వరకు ఈ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆ తర్వాత రెండో విడత మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ఇక ఈ రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగించనున్నారు. అయితే రాష్ట్రపతి ప్రసంగాన్ని 16 విపక్ష పార్టీలు బహిష్కరించిన సంగతి తెలిసిందే. రైతు ఉద్యమానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ విషయంలో పునరాలోచించుకోవాలని విపక్ష పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఏ అభ్యంతరాలు అయినా సభలో చర్చిద్దామని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news