యశోద ఆ హీరోయిన్ చేస్తే ఇంకా బావుండేది.. పరుచూరి గోపాలకృష్ణ..

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద చిత్రం ఎంత మంచి టాప్ తెచ్చుకుందో అందరికీ తెలిసిందే ఈ సినిమాతో సమంత విమర్శకుల ప్రశంసలు అందుకుంది అయితే తాజాగా ఈ సినిమాపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు..

సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడిన పరుచూరి.. యశోద చాలా మంచి సినిమా అన్నారు అంతేకాకుండా సమంత అద్భుతమైన నటి అని ఈ సినిమాలో ఎంతో బాగా నటించిందని తెలిపారు.. అలాగే దర్శకులు హరి, హ‌రీష్‌లు సమంత పాత్రను తీర్చిదిద్దిన తీరును ప్రశంసించారు. మొదటిలో అమాయకంగా ఉన్న అమ్మాయిగా చూపించి క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించారని అన్నారు.

నాకు ఈ సినిమా చూస్తే విజయశాంతి కర్తవ్యం గుర్తుకు వచ్చిందని అన్నారు కర్తవ్యం సినిమా వచ్చినా సమయంలో ఇలాంటి కథతో విజయశాంతి ఒక సినిమాను చేస్తే చాలా బాగుండేదని అభిప్రాయాన్ని తెలిపారు ఎలాంటి పాత్రలను విజయశాంతి అంతా అలవోకగా చేయగలరని.. ఈ కథ ఆమెకు చాలా బాగా కుదిరేదని తెలిపారు.. అలాగే నాకోసం ఈ సినిమాను ఒక్కసారి చూడండి అంటూ అభిమానుల్ని కోరారు పరుచూరి..

అలాగే సమంత అద్భుతంగా నటించింది. మురళీ శర్మ నెగటివ్‌ పాత్ర చేసినా ఎక్కడా దొరకకుండా చాలా బాగా నటించారు. రావు రమేశ్‌ది చిన్నపాత్ర అయినా చక్కగా నటించారన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ను చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు ఎంత బాగా నటించి చిత్రానికి ప్రాణం పోశారని అన్నారు.. అలాగే ఈ సినిమా డబ్బింగ్ చెప్పే సమయానికి సమంత అనారోగ్యం పాలయ్యారు అయినప్పటికీ ఆ విషయాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా అన్ని పనులు పూర్తి చేశాకే ట్రీట్మెంట్ తీసుకున్నారు.. ఇంత కష్టపడి పని చేసినందుకు ఈ సినిమాకు తగిన ఫలితం దక్కిందని చెప్పాలి పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి హిట్ టాక్ తో దూసుకుపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news