పాకిస్థాన్‌లో మారో ఘోర ప్రమాదం జరిగింది. హింధూ నదిలో వ్యాన్ పడింది. ఈ ఘటనలో మొత్తం 17మంది దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. వ్యాన్ చిలాన్ నుంచి రావల్సిండి వెళ్తుండగా వ్యాప్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. కోహిస్తాన్ జిల్లాలోని పానిబా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నదిలో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వ్యాన్‌లో డోర్లు తెరుచుకోకపోవడంతోనే అందరూ నదిలో కొట్టుకుపోయి చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే 16 మంది ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో చిన్నపిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రైలు ప్రమాద ఘటన మర్చిపోకముందే మరో ఘటన జరిగింది.