మరో విమానంలో వికృత చేష్టలు.. కెప్టెన్‌ను కొట్టి.. ఎయిర్‌హోస్టస్‌ను లైంగికంగా వేధించి

-

విమానాల్లో కొందరు ప్రయాణికుల వికృత చేష్టలు.. అసభ్య ప్రవర్తన.. తోటి ప్రయాణికులకు, ఉద్యోగులకు తంటాలు తెచ్చిపెడుతోంది. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇటీవల ఎయిర్​ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు తప్పతాగి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఎయిర్‌హోస్టస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడటమేగాక, అడ్డొచ్చిన విమాన కెప్టెన్‌పై దాడి చేశాడు. ఆదివారం రాత్రి దిల్లీ నుంచి పట్నా వెళ్లిన ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది.

ఈ విమానంలో ముగ్గురు ప్రయాణికులు మద్యం మత్తులో రచ్చరచ్చ చేశారు. ఫ్లైట్‌ అటెండెంట్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. వీరిని అడ్డుకునేందుకు కెప్టెన్‌ ప్రయత్నించగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీంతో విమాన సిబ్బంది వీరి గురించి ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. రాత్రి 10 గంటలకు విమానం పట్నా విమానాశ్రయంలో దిగగానే సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు వీరిలో ఇద్దరిని పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరో వ్యక్తి పరారవ్వగా అతడి కోసం గాలిస్తున్నారు. నిందితులంతా బిహార్‌కు చెందినవారే. వీరికి రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) పార్టీతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news