యజమానులం అనుకోవద్దు.. దేవాలయ ఆస్తుల గురించి పవన్ కీలక ప్రకటన !

-

మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకం ఏపీ రాజకీయాల్లోతీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రక్రియని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక లేఖ విడుదల చేశారు. దేవాదాయ శాఖకు చెందిన భూములకు ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలి. ఆస్తులను సంరక్షించాలి తప్ప అమ్ముకోవడానికి వీలు లేదు. దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు కూడా ఉందని ఆయన ఉదహరించారు.

ప్రజల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని మే 25వ తేదీన టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిలుపుదల చేస్తూ జి.వో.888ను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన గుర్తు చేసారు. ఈ నిలుపుదల ఉత్తర్వులనే రాష్ట్రంలోని అన్ని ఆలయాలు,మఠాల ఆస్తులకు వర్తింపజేయాలని పవన్ డిమాండ్ చేశారు. ధర్మ పరిరక్షణకు ఉద్దేశించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గితేనే వేలం, విక్రయం ప్రకటనలు వస్తాయని ఆయన విమర్శించారు. దాతలు ఇచ్చిన ఆస్తులను నడి బజారులో అమ్మకానికి పెడితే మనోభావాలు దెబ్బతినే భక్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అన్నారు. దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు తామే యజమానులం అనుకోవద్దు అంటూ పవన్ కాస్త ఘాటుగానే స్పందించారు.  

Read more RELATED
Recommended to you

Latest news