#shamelessTv9 ట్విట్టర్ లో ట్రెండింగ్.. ఫ్యాన్స్ తో పెట్టుకుంటే అంతే !

-

పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ మాధవి లత రాసిన ఒక బహిరంగ లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల పవన్ పుట్టిన రోజు సంధర్భంగా సోషల్ మీడియాలో తనని విష్ చేసిన అందరినీ పేరుపేరునా థాంక్స్ చెబుతున్నారు. అయితే అలా చెప్పడం తనకు నచ్చలేదని చెబుతూ హీరోయిన్ మాధవీలత తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఈ విషయాన్ని అందరూ లైట్ తీసుకున్నా ప్రముఖ ఛానల్ టీవీ9 సీరియస్ తీసుకుని వరుస కధనాలు ప్రసారం చేసింది. ఈ విషయం మీద పవన్ ఏమీ స్పందించలేదు కానీ జనసేన తరపున ఒక ప్రకటన విడుదల అయింది.

ఇది సరికాదని, ఆమె పోస్ట్ ని బేస్ చేసుకుని ఇలా కధనాలు ప్రసారం చేయడం వలన జనసేన కార్యకర్తలు బాధ పడుతున్నారని పేర్కొంది. పార్టీ వారిని సంయమనంగా ఉండాలని కోరిందని అన్నారు. ఇక ఎప్పుడైతే ఆ లేఖ విడుదల అయిందో ఇక పవన్ ఫ్యాన్స్ ఆ ఛానెల్ మీద ట్విట్టర్ వేదికగా విరుచుకు పడుతున్నారు. #shamelessTv9 అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రేండింగ్ లోకి వెళ్ళింది. నిన్నటి సంగతి మొదలు, టీవీ 9 పవన్ నే కాక, రేవంత్ రెడ్డి వంటి వారిని ఎలా టార్గెట్ చేసిందో వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ఈ #shamelessTv9 ట్యాగ్ తో 239K ట్వీట్స్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news