వచ్చే ఎన్నికలలో నాకు అండగా నిలబడండి… నేను చావడానికైనా సిద్దమే… తల వంచనబోనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ నర్సాపురంలో మత్స్య కార్మికుల హక్కుల కోసం బహిరంగ సభ నిర్వహించింది జనసేన పార్టీ.
ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ఉత్సాహంగా మాట్లాడే పరిస్థితిలో తాను లేనని.. దారి పొడవున గోతులు, గుంతలే అంటూ ఏపీ రోడ్ల పై కౌంటర్ వేశారు. ఏపీ రోడ్లను చూస్తే.. మాయాబజార్ లో లాహిరి లాహిరిలో పాట గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. మత్స్యకారులకు జీవో 217 పెద్ద సమస్యగా మారిందని ఫైర్ అయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లక్షన్నర మంది మత్య్సకారులు ఉన్నారని.. జనసేనకు పది మంది ఎమ్మెల్యేలు ఉంటే జీవో 217 వచ్చేది కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అన్యాయం జరుగుతుంటే తిరగ బడడంలేదు… అది వారి సహనం అన్నారు. ఉత్పత్తి కులాల వారు వ్యాపారం చెయ్యలేరని.. మీరు ఒక్క ఎన్నికకు నాకు అండగా నిలబడండని కోరారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులు ఇళ్లు కట్టుకుంటే 70వేలు అదనంగా ఇచ్చేవారని.. ఎంత పెద్ద వాళ్లైనా సరే జగన్ వద్దకు వచ్చి సర్ మీరు మాకు చెయ్యాలి సర్ అనాలన్నారు.