ప‌వ‌న్ రైతు భ‌రోసా యాత్ర ప్రారంభం

అనంతపురం జిల్లా కొత్త చెరువులో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఇటీవల సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు సాకే రామకృష్ణ   కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య శ్రీమతి సాకే సుజాతకు అందజేశారు. పార్టీ తరఫున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా   పవన్ కళ్యాణ్   భరోసా ఇచ్చారు.  పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ గారు, పీఏసీ సభ్యులు  నాగబాబు,చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు  టి.సి. వరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   రామకృష్ణ చనిపోయిన తరువాత తమ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోలేదని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని ఈ సందర్భంగా బాధితురాలు సుజాత  పవన్ కళ్యాణ్  కి తెలిపారు.