షూటింగ్స్ ఆపేస్తే మంచిది : పవన్ కళ్యాణ్

-

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు సీరియల్ షూటింగ్ లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో జరుగుతున్న చిత్రీకరణలపై తాజాగా జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చిత్రీకరణలు ఆపేస్తే ఎంతో మంచిది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. తొందరపడి ఇప్పుడు మొదలు పెడితే మాత్రం ఇబ్బందులు తప్పవు అంటూ ఆయన తెలిపారు.

pawan-kalyan
pawan-kalyan

అయితే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కలిస్తే నిబంధనలతో కూడిన అనుమతులు వచ్చాయని…కానీ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా చిత్రీకరణలు జరిపే పరిస్థితి లేదు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. షూటింగ్ నిర్వహిస్తే కరోనా బారిన పడే అవకాశం ఉందని… మొన్నటికి మొన్న అమితాబచ్చన్ కరోనా వైరస్ బారిన పడిన ఘటన ఇందుకు నిదర్శనం అంటూ పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి కాగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news