పవన్ కళ్యాణ్ డిమాండ్.. ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలి..!

-

నవరస నటన సార్వభౌముడిగా పేరుగాంచిన టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలుగులో ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన సత్యానారాయణ తెలుగు నేలపై పుట్టడం మన అదృష్టమన్నారు. ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు.

మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడంలో సత్యనారాయణ గారు కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా పవన్  గుర్తు చేసారు. అంతేకాదు నటుడిగానే కాకుండా నిర్మాతగా పలు ఉత్తమ చిత్రాలను నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సినీ రంగంలో అంచలంచెలుగా ఎదిగి ఎందరో ఔత్సాహిక కళాకారులకు ఆదర్శంగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news